Andhra PradeshsocialTelangana

ఉగాది విశిష్టత

ప్రభవతో మొదలై అక్షయతో ముగిస్తే ఒక ఆవృతం

చైత్ర శుక్ల పాడ్యమి నాడే అనగా ఉగాది రోజున సృష్టి జరిగిందని నారద పురాణంలో వివరించారు. వసంతం రుతువు ప్రారంభమైన చైత్రశుక్ల పాడ్యమి రోజున సూర్యుడు దినరాజై ఉండగా ప్రజాపతి బ్రహ్మ ఈ రసజగత్తును సృష్టించాడు. కాల గణన, గ్రహ నక్షత్ర, రుతు, మాస వర్షాలను, వర్షాధిపులను ప్రవర్తింపజేశాడు. కాలగమనంలో మార్పులు సహజం. కల్పంలో యుగాలు. ఈ యుగాలు మారేకొద్దీ ధర్మాలు కూడా మారుతాయి. ప్రస్తుతం కలియుగం నడుస్తోంది. తెలుగు సంవత్సరాలకు ప్రత్యేకంగా పేర్లు ఉన్నాయి. ఆయా పేర్లను బట్టి ఫలితాలు ఎలా ఉంటాయో ఊహించి చెప్పవచ్చు. తెలుగు సంవత్సరాలు 60. ప్రభవతో మొదలై అక్షయతో ముగిస్తే ఒక ఆవృతం పూర్తయినట్లు. మళ్లీ తిరిగి ప్రభవతో ఆరంభమవుతుంది. ఈ పేర్ల వెనుక భిన్న వాదనలు ఉన్నాయి. ఓ పురాణ కథనం నారదుడి పిల్లల పేర్లు వీటికి పెట్టారనే మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. దక్షుడు కుమార్తెల పేర్లుకూడా ఇవేనని అంటారు.

కాలమానంలోని అంశాలన్నింటిని పూర్తిగా ఖగోల శాస్త్రరీత్యా పురాతన భారతీయులు నిర్ణయించారు. కాలమాన అంశాలైన రోజు, వారం, పక్షం, కార్తె మాసం, రుతువు, అయనం, సంవత్సరం, పుష్కరం, శకం, యుగం, కల్పకం మొదలైన అన్నింటినీ ఖగోళ శాస్త్ర ఆధారంగానే ఏర్పాటు చేసుకున్నారు. ఖగోళపరమైన కాలమానాన్ని పురాణకాలం నుంచి ఆచరించడం భారతీయుల ఘనత. ఇది మన భారతజాతి కాలమాన పరిజ్ఞానానికి ఉన్న అవగాహనను తెలిజేస్తుంది. అంతేకాదు మన సంస్కృతి, సంప్రదాయాలకు నిలువుటద్దంగా ఉంది ఉగాది.

ఉగాది తెలుగువారికి ముఖ్యమైన పండగ.. దీనిని ఎంతో ఘనంగా జరుపుకుంటారు. తెలుగు వారు చాంద్రమానాన్ని అనుసరిస్తారు. కాబట్టి ఇది చైత్ర మాస చైత్ర మాస శుద్ధ పాడ్యమి నాడు వస్తుంది. ఈరోజున పంచాంగ శ్రవణం, షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి ని తినడం ప్రశస్త్యమైంది. మహిళలు ఉగాది పచ్చడి తయారు చేసి దేవునికి నైవేద్యంగా పెడతారు. ఇంట్లోవారంతా స్నానం చేసి, కొత్త బట్టలు ధరించి పరగడుపున ఉగాది పచ్చడి తిని తర్వాత అల్పాహారం తీసుకుంటారు. ఆ రకంగా తమ జీవితాలు అన్ని అన్ని రుచుల మిశ్రమంగా ఉండాలని ఆకాంక్షిస్తారు. హిందువులకు అత్యంత శ్రేష్ఠమైన ఈ పండుగను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో జరుపుకుంటారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close