social

నేను ఒంటరిగానే…ఉన్నాను

అబ్బాయి ఎక్కడ ఉన్నాడో ఏమో…..

అందాల తార సోనాక్షి సిన్హా పెళ్లి గురించి చాలా కాలంగా వినిపిస్తోంది. ఆమె నటుడు జహీర్‌ ఇక్బాల్‌తో ప్రేమలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇలాంటి వార్తలు బాలీవుడ్‌లో తరచుగా వినిపిస్తుంటాయి కాబట్టి వాళ్ళు కూడా తేలిగ్గా తీసుకుంటారు. అందుకే తన ప్రేమ వార్తలు నిజం కాదని సోనాక్షి స్పష్టం చేసింది. అంతేకాదు మంచి అబ్బాయి ఉంటే చెప్పండి, నచ్చితే పెళ్లి చేసుకుంటాను అని నవ్వుతూ అంటోంది. ఈ విషయాన్ని ఎందుకు చెప్పిందంటే…. సోనాక్షి నటించిన తాజా చిత్రం కళంక్‌ త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమా ప్రచారంలో భాగంగా ఒక టీవీ రియాలిటీ షోలో పాల్గొంది. అక్కడ వ్యాఖ్యతగా ఉన్న శిల్పాశెట్టి మాట్లాడుతూ సోనాక్షి గురించి వినిపిస్తున్న వార్తల గురించి అడిగింది. నేను ఒంటరిగానే ఉన్నాను అంటూ సోనాక్షి తెలిపింది. మంచి వ్యక్తి దొరికితే పెళ్లి చేసుకుంటాను అని అంటోంది. తనను చేసుకోబోయేవాడు తన వ్యక్తిగత జీవితంలో తలదూర్య కూడదని కండీషన్‌ పెట్టింది. అలాగే తనపై అజమాయిషీ కూడా చేయకూడదని షథరతు విధించింది. సోనాక్షి షరతులకు లోబటి ఉండే అబ్బాయి ఎక్కడ ఉన్నాడో ఏమో…..

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close