
హైదరాబాద్, మార్చి 24 : లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో 20 మంది స్టార్ క్యాంపెయినర్లుగా పాల్గొంటారని టీఆర్‌ఎస్ వెల్లడించింది. ఈ మేరకు సీఈవోకి వివరాలు అందజేసింది స్టార్ క్యాంపెయినర్లకు అవసరమైన అనుమతులు, పాసులను సమకూర్చాలని ఆయనను కోరారు. అయితే.. కీలక నేతగా ఉన్న మాజీ మంత్రి హరీశ్‌రావు పేరు టీఆర్‌ఎస్ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో లేకపోవడం గమనార్హం..! జాబితాలో కేసీఆర్, కేటీఆర్‌తోపాటు.. మహమూద్ అలీ, ఇంద్రకరణ్‌రెడ్డి, ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, జి.జగదీశ్‌రెడ్డి, సీహెచ్.మల్లారెడ్డి, వి.శ్రీనివా్‌సగౌడ్, ఎస్.నిరంజన్‌రెడ్డి, వి.ప్రశాంత్‌రెడ్డి, టి.శ్రీనివా్‌సయాదవ్, కె.కేశవరావు, జె.సంతో్‌షకుమార్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శేరి సుభా్‌షరెడ్డి, ఆర్.శ్రావణ్‌కుమార్‌రెడ్డి, బండ ప్రకాశ్, టి.రవీందర్‌రావు పేర్లు ఉన్నాయి. మరోవైపు మజ్లిస్ తరఫున అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఒవైసీ, బీఎస్పీ తరఫున మాయావతి సహా 40 మంది స్టార్ క్యాంపెయినర్లుగా ఉంటారని ఆయా పార్టీలు ఈసీకి జాబితా అందజేశాయి. ఈ జాబితాలో కూడా ముందు హరీష్ రావు పేరు కనిపించలేదు. ఏమైందో ఏమో కాసేపటి తర్వాత ఈ జాబితాలో సంతోష్ పేరును తొలగించి హరీష్ పేరును జతచేశారు. హరీష్ కు వెహికల్ పాస్ జారీ చేయాల్సిందిగా ఎన్నికల కమిషన్ కు లేఖ రాశారు. అసెంబ్లీ ఎన్నికలలో కీలక స్థానాలను గెలిపించడంలో ముఖ్య పాత్ర పోషించిన హరీష్ ఈ ఎన్నికలలో ఇప్పటి వరకు ఆచూకీ లేకపోవడం.. ఇప్పుడు కూడా జాబితాలో ముందు పేరు లేకపోగా చివరికి చేర్చడం చర్చనీయంగా మారింది.