Andhra PradeshTelangana
ఎన్నికల మానిఫెస్టోలో రాజకీయపార్టీ లు బీసీలకు స్పష్టమైన హామీ ఇవ్వాలి

హైదరాబాద్ మార్చ్ 23 (Local News India)
ఎన్నికల మానిఫెస్టోలో అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు పెడతామని స్పష్టమైన హామీ ఇవ్వాలని పలు బీసీ సంఘాలు డిమాండ్ చేశాయి.శనివారంతెలంగాణ పార్లమెంట్, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో బీసీ సంఘాలు అనుసరించవలసిన వ్యూహంపై జాతీయ బీసీ సంక్షేమ సంఘం కోర్ కమిటీ సమావేశమై చర్చలు జరిపింది. హైదరాబాద్ లోని బీసీ భవన్ లో జరిగిన సమావేశానికి కోర్ కమిటీ ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఈ సమావేశానికి ఆర్.కృష్ణయ్య అధ్యక్షత వహించారు. పార్లమెంటు ఎన్నికలలో అన్నిరాజకీయ పార్టీలు బి.సిలకు టికెట్లు కేటాయించకుండ అన్యాయం చేశాయని విమర్శించారు. టి.ఆర్.ఎస్ పార్టీ బీసీలకు కేవలం నాలుగు సీట్ల కేటాయించింది. కాంగ్రెస్ పార్టీ నాలుగు సీట్లు మాత్రమే కేటాయించి బి.సిలకు అన్యాయం చేశారు. వాస్తవంగా జనాభా ప్రకారం అన్ని పార్టీలు బీసీలకు 9 సీట్లు కేటాయించాలి. బీసీలను అన్ని రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయని కాని రాజ్యాధికారంలో వాటా ఇవ్వకుండ అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. అన్ని రాజకీయ పార్టీలు గెలుపును దృష్టిలో పెట్టుకొని పోటీపడి డబ్బున్న వాళ్ళకే పార్లమెంట్ / అసెంబ్లీ టికెట్లు కేటాయిస్తున్నoదున బీసీలు రాజకీయంగా అన్యాయానికి గురవుతున్నారని అన్నారు.గెలుపు గుర్రాల పేరు మీద పారిశ్రామిక వేత్తలకు, కాంట్రాక్టర్లకు,వ్యాపారస్తులకు టిక్కెట్లు ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అర్ధబలం – అంగ బలం పేరు మీద బి.సి లకు అన్యాయం చేస్తున్నారు. సోషల్ ఇంజనీరింగ్ చేస్తే అర్ధ బలం – అంగ బలం పని చేయదన్నారు. ఏ నియోజక వర్గం లో ఏ బి.సి కులాల జనాభా ఎక్కువగా యుంటే ఆయా బి.సి కులాలకు టిక్కెట్లు ఇస్తే విజయం సాధించే సోషల్ ఇంజనీరింగ్ చేసే అవకాశం యున్న బి.సి ల నాయకత్వాన్ని తొక్కడానికి కుట్రలు జరుగుతున్నాయని విమర్శించారు. గ్రామాలలో బి.సి కులాలో విపరీతమైన రాజకీయ చైతన్యం వచ్చింది.ఇష్టమొచ్చినట్లు టిక్కెట్లు ఇస్తే గుడ్డిగా ఓట్లు వేయరన్నారు. ఇలాంటి పరిస్థితులలో బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు పెడితేనే రాజకీయంగా న్యాయం జరుగుతుందన్నారు. అందుకే ఈ సమావేశానికి తెలంగాణ లోని మెదక్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి కర్నూల్, అనంతపురం, చిత్తూరు, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల నుంచి వచ్చిన బి.సి నాయకులు ప్రసంగించారు.