Telangana
ప్రజల నిర్ణయం ప్రకారమే భవిష్యత్తు కార్యాచరణ-వివేక్
పెద్దపల్లి: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మాజీ ఎంపీ వివేక్ తీవ్ర ఆరోపణలు చేశారు. కేసీఆర్ నమ్మించి గొంతు కోశారని ధ్వజమెత్తారు. శుక్రవారం ప్రభుత్వ సలహాదారు పదవికి వివేక్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. భవిష్యత్ కార్యాచరణపై అనుచరులతో వివేక్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పెద్దపల్లి జిల్లాకు వెంకటస్వామి పేరు పెడతానని చెప్పి కేసీఆర్ మోసం చేశారన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థుల ఓటమికి ప్రయత్నం చేశానని.. తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని కొట్టిపారేశారు. నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. బానిస సంకెళ్ళు తెగాయని చెప్పారు. ఇక ప్రజల మధ్యే ఉంటానని స్పష్టంచేశారు. ప్రజల నిర్ణయం ప్రకారమే భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందని వెల్లడించారు.