Andhra PradeshTelangana
ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర-భట్టి సీఎల్పీ నేత

హైదరాబాద్, ఏప్రిల్ 22 (న్యూస్ పల్స్)
తెలంగాణ ముఖ్యమంత్రి పొలిటికల్ టెర్రరిస్ట్‌లా మారిపోయారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం ఉదయం బాన్స్వాడలో స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డిని కలిసిన అనంతరం హైదరాబద్‌లోని గాంధీభవన్‌లో భట్టి విక్రమార్క మాట్లాడారు. ఈ మీడియా సమావేశంలో భట్టి విక్రమార్కతో పాటు మాజీ విప్ ఈరవత్రి అనిల్ ఆలిండియా కిసాన్ సెల్ వైస్ ఛైర్మాన్ కోదండరెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ కిసాన్ సెల్ ఛైర్మన్ అన్వేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్రమైన ఆరోపనలు చేశారు. ముఖ్యమంత్రి రాష్ట్రంలో రాజకీయ ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తూ.. తానే ఒకపొలిటికల్ టెర్రరిస్ట్‌లా మారిపోయారని తీవ్రమైన ఆరోపణలు చేశారు.
తెలంగాణలో ప్రజాస్వామ్యం తీవ్ర ప్రమాదంలో పడిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చెప్పారు. క్విడ్.. ప్రో..కో కింద ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారని భట్టి అన్నారు. టీఆర్ఎస్లోకి వస్తే.. మీకు భూములు రెగ్యులరైజ్ చేస్తాం, ప్రాజెక్టులు, కాంట్రాక్టులు కట్టబెడతాం, ఆర్థిక సహకారం అందిస్తాం.. మారు పార్టీ మారండి.. అంటూ క్విడ్.. ప్రో.. కో కింద ఎమ్మెల్యేలను పార్టీ మారుస్తున్నారని భట్టి అన్నారు. పార్టీ మారండి.. మీకు అదిస్తాం.. అనే పద్దతిలో టీఆర్ఎస్ ఉందని అన్నారు
అవినీతి సొమ్మును బయటకు తీస్తాం
రీ డిజైన్ ల పేరుతో ప్రాజెక్టు లలో సంపాదించిన అవినీతి సొమ్మును బయటకి తీస్తామని భట్టి అన్నారు. పైపుల మీద పైసల కోసమే మిషన్ భగీరథ ను తీసుకువచ్చారు. లోక్ పాల్ ను కూడా ఆశ్రయిస్తాము. పొలిటికల్ టెర్రరిజం ను అంతం మొందిస్తాము. పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజక వర్గాలలో రెండు లేదా మూడు రోజుల్లో ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర చేపడుతాము. పినపాక నుండి ప్రజాస్వామ్య యాత్ర ప్రారంభిస్తామని భట్టి విక్రమార్క ప్రకటించారు.