Andhra Pradesh
నటుడు మోహన్ బాబు నిరసన
తిరుపతి, మార్చి 22 (Local News India)
శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థలకు స్కాలర్షిప్ బకాయిల పై గతంలో చంద్రబాబు ప్రభుత్వం పై బహిరంగ విమర్శలు చేసిన ప్రముఖ సినీనటుడు, విద్యానికేతన్ సంస్థల ఛైర్మన్ మోహన్ బాబు ఇప్పుడు ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమయ్యారు.. తన సంస్థ లోని విద్యార్థులతో కలిసి స్కాలర్షిప్ సమస్యలపై నేడు ర్యాలీ నిర్వహించి, తమ నిరసనను తెలుయ చేయాలని అయన నిర్ణయించారు. అయితే, ఎన్నికల వేళ ర్యాలీలు, బహిరంగ నిరసనలకు అనుమతులు ఇవ్వలేమని పోలీసులు అయనకు చెప్పారు. ముందు జాగ్రత్తగా మోహన్ బాబుతో పాటు విద్యాసంస్థకు చెందిన మరికొంత మంది కీలక సభ్యులను గృహ నిర్భందం చేసారు. ఈ పరిణాయలపై స్పందించిన మోహన్ బాబు ఎట్టిపరిస్థితిలోను నిరసన ర్యాలీని కొనసగిస్తానంటూ ప్రకటించారు. విద్యానికేతన్ ఎదుట మోహన్ బాబు, ఆయన కుమారులు విద్యార్థులతో కలిసి నిరసన దీక్షకు దిగారు. పోలీసుల మోహరింపుతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసుల తీరును నిరసిస్తూ రోడ్డు పైనే మోహన్ బాబు పడుకున్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ పై ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని మోహన్ బాబు ఆరోపించారు. ఎన్నో విద్యా సంస్థలకు ఇవ్వాల్సిన నిధులను సీఎం చంద్రబాబు ఉద్దేశపూర్వకంగానే విడుదల చేయడం లేదని విమర్శించారు. మీ డ్యూటీలు మీరు చేయండి. నా ఈ నిరసన మాత్రం ఆగదంటూ స్పష్టం అయన స్పష్టం చేసారు. నాలుగున్నరేళ్లుగా చంద్రబాబు నమ్మించి మోసం చేశాడు. 19 కోట్ల మేర ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి. ఎన్నిసార్లు ప్రభుత్వానికి తెలిపినా పట్టించుకోలేదు. ఆఖరికి చంద్రబాబుకి నేనే స్వయంగా ఉత్తరాలు రాసిన ఫలితం లేదని అయన విమర్శించారు. ఉన్న పథకాలను అమలు చేయకుండా, కొత్త పథకాలతో మోసాలకు పాల్పడుతున్నాడు. ఇన్నాళ్లు గుర్తుకు రాని మహిళలు ఇప్పుడు గుర్తుకొచ్చారా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఒక అబద్దాల కోరు. ఎన్ని అడ్డంకులు సృష్టించిన నా నిరసనను అడ్డుకోలేరు. నా బిడ్డల భవిష్యత్తు కోసమే ఈ ఉధ్యమమని అయన అన్నారు.