Andhra Pradesh
ఏపీలో మారుతున్న సీన్…..
విజయవాడ, మార్చి 20, (Local News India)
ఎన్నికల నగారా మోగింది. నాయకులు, పార్టీలు కూడా క్షణం తీరిక లేకుండా బిజీబిజీ అయిపోయారు. ఇది నాణేనికి ఒక పార్శ్వం. అయితే, రెండో పార్శ్వం మాత్రం ప్రజలు. వీరి కరుణ లేకుంటే ఏ నాయకుడైనా.. ఎవరైనా కూడా విజయం సాధించడం చాలా కష్టం. ఇప్పుడు, ఈ పరిణామమే రాష్ట్రంలో పార్టీలను బెంబేలెత్తిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో అధికార పార్టీ అన్నీ చేశామని చెబుతోంది. అన్ని విషయాల్లోనూ తామే నెంబర్ 1 అని నొక్కివక్కాణిస్తోంది. రాష్ట్రాన్ని ఈ మాత్రం అభివృ ద్ధి చేశామంటే .. అది తమవల్లే సాధ్యమైందని స్పష్టం చేస్తోంది. ఇక, ఇదే సమయంలో పాదయాత్ర, నవరత్నాలు అంటూ ప్రజల్లోనే ఉన్న జగన్ కనిపిస్తున్నారు.
రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు చాలా వేగంగా మారుతున్నాయి. అధికారంలోకి వచ్చే పార్టీ ఏది? ఎవరు అధికా రంలోకి వస్తున్నారు? అనే అంచనాలు చాలా వేగంగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా కూడా ఏపీ ఎన్నికల పై పెద్ద ఎత్తున ఆసక్తి నెలకొంది. వచ్చే ఎన్నికలు చాలా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రాజకీయ నేతలు కప్పదాటు ళ్లను జోరుగా పెంచేశారు. ఎవరికి వారే పార్టీలు మారుతున్నారు. అయితే, ఇక్కడ విచిత్రంగా మరోసారి విజయం సాధిస్తార ని గట్టిగా నమ్ముతున్న చంద్రబాబు పక్షంలోకి కాకుండా విపక్షం వైసీపీలోకి నేతలు క్యూ కడుతుండడంతో పరిస్థితి ఆసక్తి గా మారింది.కీలకమైన నాయకులు కూడా ఎన్నికల వేళ.. వైసీపీబాట పడుతుండడం, టీడీపీలో టికెట్ల వ్యవహారం కొలిక్కి రాకపోవడంతో నేతల మధ్య తీవ్ర ఆవేదన ఆందోళన ఎదురవుతోంది. ఇప్పటికే చాలా మంది టీడీపీకి రాం రాం చెప్పారు. ఇక, ఇదే సమయంలో వైసీపీ నుంచి కూడా నాయకులు టీడీపీలోకి జంప్ చేశారు. ఇలా వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణల నేపథ్యంలో రాష్ట్రంలో అసలు ఏ పార్టీకి మద్దతు పెరుగుతోంది? ఏ పార్టీకి ప్రజలు అండగా ఉండాలనే విషయంపై సర్వత్రా గందరగోళం నెలకొంది. అధికార టీడీపీని తీసుకుంటే.. వివాదాస్పదమైన ఎమ్మెల్యేలకే మళ్లీ టికెట్లు ఇచ్చి.. తమది నిజాయితీతో కూడిన పార్టీ అని చెప్పుకొంటున్న చంద్రబాబును, నిన్న మొన్నటి వరకు పార్టీని నమ్ముకున్న నాయకులను కాదని.. కొత్తవారికి పట్టంకడుతున్న జగన్‌ను ఎలా నమ్మాలనేది ప్రజల మాట. మరి ఈ రాజకీయ సమీకరణల నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాలి.