Telangana
బొగ్గుగని పైకప్పు కూలడంతో కార్మికుడు మృతి

Kalingatimes :బొగ్గుగని పైకప్పు కూలడంతో ఓ కార్మికుడు మృతి చెందిన విషాద ఘటన శ్రీరాంపూర్‌లో జరిగింది. శ్రీరాంపూర్ ఆర్కే -5బి బొగ్గు గనిలో పనులు నిర్వహిస్తుండగా ఒక్కసారిగా పైకప్పు కూలింది. ఈ ప్రమాదంలో బొగ్గుగనిలో పని చేస్తున్న రాములు(53) అనే కార్మికుడు మృతి చెందాడు. దీంతో వెంటనే స్పందించిన రెస్క్యూటీం హుటాహుటిన గని నుంచి మృతదేహాన్ని వెలికి తీశారు. రాములు మృతితో అతని కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.