social

నిధులు ఉన్న చోట గడ్డి బాగా పెరుగుతుందా ?

తిరుమల, మార్చి 8 (Local News India)
తిరుమల శ్రీవారి సంపదలు, నవనిధులను రక్షించే దేవతలు శంఖనిధి, పద్మ నిధి. వీరిలో ఎడమ వైపున అంటే దక్షిణ దిశలో శంఖనిధి, కుడి వైపున అంటే ఉత్తర భాగాన పద్మనిధి ఉంటారు. శంఖనిధి చేతుల్లో శంఖాలు, పద్మనిధి చేతుల్లో పద్మాలు ఉంటాయి. శ్రీవారి ఆలయ మహాద్వారానికి ఇరుపక్కల ద్వారపాలకుల్లా సుమారు రెండడుగుల ఎత్తులో ఈ పంచలోహ విగ్రహాలు ఉంటాయి. ఆలయంలోనికి ప్రవేశించే ముందు కాళ్లను ప్రక్షాళన చేసుకునే దగ్గర గడపకు ఇరువైపులా కనిపిస్తారు. కాళ్లు కడుక్కునే ఆలోచనలో ఉంటారు కాబట్టి వారిని గమనించే అవకాశం తక్కువగా ఉంటుంది. దీంతో పాటు దేవదేవుని దర్శనం కోసం ఎదురుచూసిన ఆనందంలో కూడా గమనించరు. ఈ నిధిదేవతల పాదాలవద్ద ఆరంగుళాల పరిమాణంగల రాజవిగ్రహం నమస్కార భంగిమలో నిల్చొని ఉంటుంది. ఇది విజయనగర రాజు అచ్యుత దేవరాయల విగ్రహం. బహుశా అచ్యుతరాయలే ఈ నిధి దేవతలను ప్రతిష్టించి ఉంటారని భావిస్తున్నారు. ఆగమ శాస్త్రం ప్రకారం సాధారణంగా నిధి దేవతలను ఆలయానికి మూడో ప్రాకార ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటు చేస్తారు. కాబట్టి, తిరుమల ఆలయం కూడా మూడు ప్రాకారాలు కలిగినదేనని తెలుస్తోంది. ఇక, పరమేశ్వరుడు ఉపదేశించిన ప్రకారం నిధులు నాలుగు రకాలు.. అవి కచ్చప, మకర, శంఖ, పద్మ. వీటిలో కచ్చప, మకర మాత్రమే స్థిరంగా ఒకేచోట ఉంటాయి. వీటిని ప్రయత్నం, శివానుగ్రహంతో మాత్రమే పొందగలం. శంఖ, పద్మ నిధులు మానవుని శబ్దం వినపడిన వెంటనే చంచలమై వేరొక స్థానానికి వెళ్లిపోతాయి. వీటిని సాధించడం అసంభవం. శివ, విష్ణు, అమ్మవారి అనుగ్రహం పొందిన వారికి మాత్రమే అవి దక్కుతాయి. భూమి నుంచి తామర పువ్వుల వాసన వచ్చే ప్రదేశం, డేగలు, కాకులు, కొంగలు లాంటి పక్షులు ఎక్కువగా సంచరించే చోట, కాకులు విశేష ప్రీతితో సంభోగం చేసే ప్రదేశాల్లో నిధులు ఉంటాయట. వృక్షాలు అనేకం ఉన్న ఒకే చెట్టుపై పక్షులన్నీ కలిసి నివసించే స్థలం, పురాతన దేవాలయం, పాడుబడిన చెరువులు, గ్రామాలు, నిత్యం పశువులు మేస్తున్నా తిరిగి తెల్లవారే సరికి నిధి ఉన్న ప్రదేశంలో గడ్డి తొందరగా పెరుగుతుందట.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close