Telangana
మహాశివరాత్రి జాతర కు సర్వసన్నద్ధం

వేములవాడ,మార్చి 2 LOCAL NEWS INDIA)
వేములవాడ లోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం దాని పరిసరాలలో జరిగే మహాశివరాత్రి జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గత నెల 19 తేదీన ప్రారంభమైన మహాశివరాత్రి హరితహరం, పారిశుధ్య డ్రైవ్ ముమ్మరంగా సాగింది . అటవీశాఖ, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, రోడ్లు భవనాలు, మున్సిపల్ ప్రభుత్వ విభాగాలు డ్రైవ్ లో భాగం పంచుకున్నాయి. శాత్రాజుపల్లి, సిరిసిల్ల, నాంపల్లి, కోనాయిపల్లి నుంచి వేములవాడ పట్టణం వరకు డ్రైవ్ జరిగింది. ప్రతిరోజూ 1000 కి పైగా ఉపాధి హామీ కూలీలు డ్రైవ్ లో భాగస్వామ్యం అయ్యారు .
చందుర్తి, కొనారావుపేట, సిరిసిల్ల, వేములవాడ, బోయినిపల్లి ఎంపీడీవోలు, ఐదు మంది ఏపీవోలు, 18 మంది టెక్నికల్ అసిస్టెంట్ లు, 22 మంది ఫీల్డ్ అసిస్టెంట్ లు, ఇద్దరు ఫారెస్ట్ రేంజ్ అధికారులు, ఇతర అధికారులు పాల్గొన్నారు . వీటితో పాటు రహదారికి ఇరువైపుల 3 జేసీబీలు, 10 బ్లేడ్ ట్రాక్టర్లు, అధికారులు డ్రైవ్ కు ఉపయోగించారు . హరితహరం జాతరలో రహదారికి ఇరువైపులా నాటాల్సిన మొక్కలను అటవీశాఖ అధికారులు సమకూర్చారు మహాశివరాత్రి జాతరకు ముందే పారిశుధ్యం, హరితహారం జాతరకు శ్రీకారం చుట్టి విజయవంతం చేసారు.
మహా జాతరకు .. మహా ఏర్పాట్లు
సాధారణ భక్తుల కేంద్రంగా ఏర్పాట్లు
ప్రముఖ పుణ్య క్షేత్రమైన వేములవాడ రాజన్న సన్నిధిలో మార్చి 3, 4, 5 రోజుల్లో మ హాశివరాత్రి జాతర నిర్వహణ కోసం వైభవంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా కలెక్టర్ వెంకట్రామ రెడ్డి ఏర్పాట్లను ఎప్పటికప్పుడు అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు రూ. కోటి యాభై లక్షలతో మహా శివరాత్రి జాతర ను అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్నారు. జాతరకు వ చ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు .
12 ప్రత్యేక ఉచిత బస్సులు
ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ అధికారులు షటిల్ ప్రత్యేక బస్సులను నడపనున్నారు . వేములవాడ పట్టణంలో భక్తుల కోసం తిరగనున్న ఉచిత ఆర్టీసీ బస్సులను ఆధ్యాత్మిక ఉట్టిపడేలా రథం లా తీర్చిదిద్దుతున్నారు . పట్టణంలో 12 బస్సులను నడపనుండగా వేములవాడ -సిరిసిల్ల పట్టణాల మధ్య 3 ఉచిత బస్సులు నడుపు తున్నారు . బస్సులలో త్రాగునీటి సౌకర్యం , డస్ట్ బిన్ ను ఏర్పాటు చేయనున్నారు . ఈ ఉచిత బస్సులలో ప్రయాణించే భక్తులకు లక్కీ డీప్ ప్రయోజనాలు అందించనున్నారు . 100 మంది లక్కి డీప్ విజేతలకు ఈ నెల 6 న రూ.1,016/- చొప్పున ఆర్థిక బహుమతి అందిస్తారు. మహాశివరాత్రి జాతరను తెలియజేస్తూ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముఖ్య కూడల్లతో పాటు , ప్రముఖ పట్టణా ల్లో హోర్డింగ్లను ఏర్పాటు చేశారు. వీఐపీ పాస్లను కట్టడిచేస్తూ సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం చేసుకునేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. భక్తులు కొరకు వై ద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన క్యూ లైన్ల వద్ద తాగు నీరు, మజ్జిగ వైద్య సదుపాయం కల్పించారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 1700 వందల మంది కి పైగా పోలీసులు జాతర బందోబస్తు నిర్వహించనున్నారు. 270 కెమెరాలను గుడి ఆవరణలో ఏర్పాటు చేశారు. మహా శివరాత్రి జాతరను జాతీయ స్థాయిలో గుర్తించే విధంగా రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో శివార్చన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 5 లక్షల మంది కొరకు రాజన్న లడ్డులను ఏర్పాటు చేశామని,3 లక్షల మందికి సరిపోయే విధముగా పులిహోర తయారు చేసి నట్లు ఆలయ ఈవో దూస రాజేశ్వర్ తెలిపారు.
జిల్లా కలెక్టర్ వెంకట్రామ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే జాతర ఏర్పాట్లను దాదాపుగా పూర్తీ చేశామన్నారు .ప్రభుత్వ ఆదేశాల మేరకు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నామన్నారు . భక్తుల రద్దీ దృష్ట్యా మూలవాగు పై వేములవాడ పట్టణంలో కొత్త వంతెనను వినియోగంలోకి తెచ్చామన్నారు . సాధారణ భక్తులకు సులభంగా,వేగంగా దర్శనం అయ్యేలా చూస్తున్నామన్నారు . రాజన్న సన్నిధికి వ చ్చే ద్విచక్ర, ఇతర వాహనాలకు వేర్వేరుగా పా ర్కింగ్ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు చెప్పారు. వేములవాడ వచ్చే ప్రధాన రహదారులకు మరమ్మత్తులు చేపట్టడం తో పాటు …ఇరువైపులా చెత్త చెదారం తొలగించి మొక్కలు నాటమన్నారు . జాతరకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచే శివార్చన సాంస్కృతిక ప్రదర్శనకు ఏర్పాట్లు పూర్తీ చేశామన్నారు