
Kalinga Times, Hyderabad : సీపీఐ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్(73) ఇకలేరు. మూత్రపిండాలు, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతూ వారం రోజులుగా హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. సుదీర్ఘకాలం ప్రజాప్రతినిధిగా కొనసాగినా.. అత్యంత నిరాడంబరుడిగా, ఆస్తిపాస్తులు కూడబెట్టుకోని నేతగా పేరు సంపాదించారు. బడుగు బలహీన వర్గాలు, సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారమే ఊపిరిగా జీవించారు. మల్లేశ్ స్వస్థలం మంచిర్యాల జిల్లా తాండూరు మండలం రేచిని గ్రామం. ఆయనకు భార్య సరోజ, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు