National
యుద్ధం అనేది ఓ విఫల విధానం..దిగివచ్చిన పాక్
న్యూఢిల్లీ ఫిబ్రవరి 27 (LOCAL NEWS INDIA)
తామెప్పుడూ శాంతి మంత్రాన్నే జపించామని పాక్ మిలిటరీ అధికారి గఫూర్ తెలిపారు. బుదవారం మీడియాతో ఆయన మాట్లాడారు. యుద్ధం చేసే సామర్థ్యం, సత్తువ రెండు దేశాలకు ఉన్నాయని, కానీ యుద్ధం అనేది ఓ విఫల విధానమని, ఇది భారత్ అర్థం చేసుకోవాలని గఫూర్ అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ నేలపై యుద్ధం జరగకుండా చూసుకోవాలన్నారు. పాక్ సైనిక బలగాలు బలంగా ఉన్నాయని కానీ తాము శాంతిని కాంక్షిస్తున్నామన్నారు. అంతర్జాతీయ సమాజం భారత్, పాక్ మధ్య ఉన్న పరిస్థితిని అంచనా వేసేందుకు రావాలన్నారు. ఇవాళ భారత విమానాలు తమ గగనతలంలోకి రావడం వల్లే తిప్పికొట్టామని గఫూర్ తెలిపారు.కాగాఇండియన్ ఎయిర్‌ఫోర్‌్్కు చెందిన రెండు విమానాలను తాము కూల్చేశామని పాకిస్థాన్ ప్రకటించిన తర్వాత అక్కడి మీడియా ఓ నకిలీ వీడియోను తమ చానెళ్లలో పదే పదే ప్రసారం చేసింది. తమ ఎయిర్‌ఫోర్స్ కూల్చిన విమానం ఇదేనంటూ చూపించడం మొదలుపెట్టారు. ఎప్పటిదో పాత మిగ్ విమానం కూలిన వీడియోలు, ఓ హాక్ ఎయిర్‌క్రాఫ్ట్ కూలుతున్న వీడియోలను చూపిస్తూ ఎక్స్‌క్లూజివ్ అంటూ వేసుకోవడం విశేషం. హాక్ ఎయిర్‌క్రాఫ్ట్ గతేడాది మార్చిలో ఒడిశా-జార్ఖండ్ సరిహద్దులో కూలింది. ఇక ఆ మిగ్ 2016 లో రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో కూలినది కావడం విశేషం. ఇక మరో చానెల్ ఈ మధ్య బెంగళూరులో కూలిన ఎయిర్‌క్రాఫ్ట్‌కు చెందిన పైలట్‌ను చూపిస్తూ హడావిడి చేసింది. అయితే ఈ వీడియోలన్నీ నకిలీవని సోషల్ మీడియాలో వెంటనే ప్రచారం మొదలైంది. మరోవైపు అసలు ఇండియాకు చెందిన ఏ ఎయిర్‌క్రాఫ్ట్‌నూ పాకిస్థాన్ కూల్చలేదని ఇండియా స్పష్టం చేసింది.