Telangana
కేసీఆర్ పంచసిద్దుడు
హైదరాబాద్, ఫిబ్రవరి 27 (LOCAL NEWS INDIA )
పుల్వామా ఘటన కు దీటయిన జవాబిచ్చిన భారత వాయుసేనను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం . ఇలాంటి చర్యలకు తెరాస మద్దతు ఉంటుంది. కాశ్మీర్ సమస్యకు మూల కారణం కాంగ్రెస్ పార్టీ యే నని ఎంపీ బూర నర్సయ్య గౌడ్, ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం నాడు తెలంగాణ భవన్ లో వారిద్దరూ మీడియాతో మాట్లాడారు. ఈ సమస్యను రాచపుండు లా చేసింది జవహర్ లాల్ నెహ్రు విధానాలే. కాశ్మీర్ కు తెలంగాణ కు పోలికలు ఉన్నాయి. కాశ్మీర్ లాగే తెలంగాణ సమస్యకు కారణమైంది నెహ్రు యేనని ఆరోపించారు. పటేల్ సమర్ధత వల్లే అపుడు తెలంగాణ భారత్ లో విలీనమయ్యింది. లేదంటే కాశ్మీరు లాగే తెలంగాణ రగిలేది. .రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ ఎంతకైనా దిగజారుతుంది. కాశ్మీరు సమస్యకు శాశ్వత పరిష్కారం కెసిఆర్ లాంటి విజనరీ వల్లే సాధ్యమవుతుంది. అయోధ్య సమస్య కు పరిష్కారం కూడా కెసిఆర్ లాంటి నాయకుడి వల్లే సాధ్యమవుతుందని అన్నారు. కెసిఆర్ పంచ సిద్ధుడు. సిద్దులకుండే గొప్ప లక్షణాలు కెసిఆర్ కున్నాయి. .పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ ముక్త తెలంగాణ అవుతుంది. బీజేపీ వల్ల సాధ్యం కానిది తెలంగాణ లో తెరాస వల్ల సాధ్యం కాబోతోంది . తెలంగాణ కు విభజన చట్టం ద్వారా దక్కాల్సిన హామీల కోసం కాంగ్రెస్ ,బీజేపీ పోరాడింది శూన్యం. తెరాస ఎంపీ ల పోరాటం వల్లే తెలంగాణ కు కొన్ని ప్రయోజనాలు చేకూరాయి. రైల్వే ప్రాజెక్టులు , జాతీయ రహదారుల లను తెలంగాణ కు తీసుకు రావడం లో యూపీఏ ప్రభుత్వం విఫలమైతే ఎన్డీయే హాయం లో పోరాడి సాధించుకున్నామని అన్నారు. కాళేశ్వరం తదితర ప్రాజెక్టులకు కేంద్రం అనుమతి ఇచ్చిందంటే తెరాస ఎంపీ ల ఒత్తిడే కారణం . హై కోర్టు కూడా పోరాడి సాధించుకున్నాం. సొంత పనుల కోసం ఎంపీ లు ఎపుడూ కేంద్రాన్ని అడగలేదు. గతం లో కాంగ్రెస్ ఎంపీ లు తమ సొంత పనుల కోసం పాకులాడే వారని విమర్శించారు. భువనగిరి లో అపుడు 29 కిలోమీటర్ల జాతీయ రహదారి వస్తే నా హాయం లో 550 కిలోమీటర్ల జాతీయ రహదారి వచ్చింది. ఎయిమ్స్ తెలంగాణ కు వచ్చిందంటే అది తెరాస ఘనతే. .పార్లమెంటు లో ప్రజా సమస్యల పై గొంతెత్తడం లో తెరాస ఎంపీ లు రాజీ లేని ధోరణి ప్రదర్శించారు ఏ రకంగా చూసినా పార్లమెంటు ఎన్నికల్లో తెరాస కు ప్రజలు ఏక పక్ష మద్దతు ఇస్తారు. కాశ్మీర్ సమస్య శాశ్వత పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం చేసే ప్రయత్నాలకు తెరాస మద్దతునిస్తుందని వారన్నారు.