న్యూఢిల్లీ ఫిబ్రవరి 27 (LOCAL NEWS INDIA)
పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లో ఉగ్ర స్థావరాలపై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ దాడి చేసిన మరుసటి రోజు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికా పాకిస్థాన్‌లోకి దూసుకెళ్లి లాడెన్‌ను హతమార్చింది.. మనమెందుకు ఆ పని చేయలేం అని జైట్లీ ప్రశ్నించారు. ఏ దేశానికైనా వారం రోజులంటే చాలా ఎక్కువ. గత 24 గంటల్లో జరిగిన పరిణామాలు చూస్తే.. ఓ వారం ఒక రోజులా అనిపిస్తుంది. అమెరికా నేవీ సీల్స్ ఒసామా బిన్ లాడెన్‌ను అబోటాబాద్‌లో మట్టుబెట్టారు. అలాంటిదే మనం చేయలేమా అని జైట్లీ అన్నారు. ఒకప్పుడు ఇదో ఊహ, ఓ కోరిక, ఓ నిరాశ, ఓ అసంతృప్తి.. కానీ ఇప్పుడది సాధ్యమైంది అని జైట్లీ అనడం గమనార్హం.