socialTelangana

సైబర్ నేరగాళ్లతో జరభద్రం

హైద్రాబాద్, ఫిబ్రవరి 26, (LOCAL NEWS INDIA)
వ్యక్తిగత సమాచారం అపరిచిత వ్యక్తులకు, స్నేహితులకు, బంధువులకు కూడా చెప్పకూడదు. దీనివల్ల అనేక కష్టనష్టాలు వచ్చే అవకాశం ఉంది. ఫోన్ నెంబర్, పిన్‌నెంబర్, ఏటీఎం పాస్‌వర్డ్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, మెయిల్ ఐడీ, పాస్‌వర్డ్ వంటి వాటిని సెల్‌ఫోన్, ఫెస్‌బుక్‌లలో పెట్టకూడదు. సెల్‌ఫోన్‌లో మన వ్యక్తగత సమాచారం అసలు నమోదు చేసుకోవద్దు. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి వాటిల్లో ఫోన్ నెంబర్ నమోదు చేయాల్సిన అవసరం లేదు. దీనివల్ల అపరిచిత వ్యక్తులకు మన ఫోన్ నెంబర్ తెలియడం వల్ల ఇతరులకు మన వ్యక్తిగత వివరాలను తెలుసుకునే అవకాశం ఉంది. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందినందున మన గురించిన వివరాలను సైబర్ నేరగాళ్లు తెలుసుకునే అవకాశం ఉంటుంది.సైబర్ నేరాలను అదుపు చేసేందుకు పోలీస్‌శాఖ చర్యలు తీసుకుంటుంది. నగర వ్యాప్తంగా సైబర్ నేరాలను అదుపు చేసేందుకు అప్పటికే చర్యలు చేపట్టారు. సైబర్ నేరాలకు పాల్పడే వారికి చెక్ పెట్టేందుకు పోలీసులు సిద్దమవుతున్నారు. సైబర్ నేరాలకు సంబంధించి ఫిర్యాదు చేయడానికి డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని పోలీసులు తెలిపారుసైబర్ నేరగాళ్లు ఎక్కడో ఉండి ఒక్క మన ఫోన్ నెంబర్ ద్వారానే మొత్తం సమాచారాన్ని తెలుసుకుని, బ్యాంక్ అకౌంట్‌లో ఉన్న నగదును కూడా డ్రా చేసుకునే వీలు కలుగుతుంది. కొన్నిసార్లు బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి మీ ఫోన్‌కు ఓటీపీ (వన్ టైమ్ పాస్‌వర్డ్) వచ్చింది, మాకు చెప్పండి మీ అకౌంట్ మారుస్తున్నాము, బ్యాంక్‌ను షిప్ట్ చేస్తున్నాము అంటూ అడుగుతారు మన ఓటీపీని ఎవరికీ చెప్పకూడదు. బ్యాంక్ నుంచి ఎవరూ ఓటీపీ అడగరు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి.మన మెయిల్‌కు ప్రతిరోజు అనేక మెసేజ్‌లు వస్తుంటాయి. ఇందులో కొన్ని కంపెనీల పేరుతో, కొన్ని ఇతర వ్యక్తుల పేరుతో వస్తుంటాయి. అయితే మనకు తెలియని మెయిల్స్‌ను ఓపెన్ చేయకూడదు. మనం ఎప్పుడైతే మెయిల్‌పై డబుల్ క్లిక్ చేశామో మన సెల్‌ఫోన్‌లో ఓ యాప్ డౌన్‌లోడ్ అవుతుంది. దీనిద్వారా మనం రోజు వారీ చేసే పనులన్నీ ఆయా వ్యక్తులు వీక్షించడం, మన ఫోన్ సంభాషణలు వినడం, మన మెసేజ్‌లను చదవడం ద్వారా మన సమాచారం మొత్తం తెలుసుకునే వీలు కలుగుతుంది. గ్యాలరీలో ఉండే ఫోటోలన్నీ వీక్షించి ఆ తర్వాత బ్లాక్ మెయిల్ చేసే అవకాశం కూడా ఉంది.అలాగే మన మెయిల్ ఐడీని అపరచితులకు అస్సలు చెప్పవద్దు. మెయిల్ ఐడీ చెప్పడం వల్ల పాస్‌వర్డ్‌ను తెలుసుకోవడం చాలా సులభం అవుతుందని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. చాలా మంది పాస్‌వర్డ్‌గా ఫోన్ నెంబర్, పేరు, ఇంటిపేరు, పెళ్లిరోజు డేట్, పిల్లల పేర్లు, పుట్టినతేదీ వంటివి ఉపయోగిస్తుంటారు. వ్యక్తిగత సమాచారాన్ని పాస్‌వర్డ్‌గా ఉపయోగించవద్దు. దీన్ని సైబర్ నేరగాళ్లు ఉపయోగించుకుంటున్నారు. పాస్‌వర్డ్‌గా ఎప్పుడూ ఇటువంటివి ఉపయోగించకుండా 8 అక్షరాలకు పైగా వేరేవి ఏమైనా ఉపయోగిస్తే సెక్యూరిటీ ఉంటుంది. పాస్‌వర్డ్ సెక్యూరిటీ ఉంటే మెయిల్ ఐడీ ఎవరికైనా తెలిసినా అంతగా ఇబ్బంది ఉండదు. మెయిల్ ఐడీ, పాస్‌వర్డ్‌లను ఉపయోగించడంలో జాగ్రత్తలు పాటించాలి.పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో ఇప్పుడు అందరూ అండ్రాయిడ్ ఫోన్‌లను ఉపయోగిస్తున్నారు. దీంతో ప్రతిరోజు మెయిల్ చూడటం, చాటింగ్ చేయడంతో పాటు ఆన్‌లైన్‌లో ఉంటుంటారు. దీనివల్ల ఫోన్‌లకు వైరస్ సోకే అవకాశం ఉంటుంది. మంచి కంపెనీకి చెందిన యాంటీవైరస్‌ను ఉపయోగించాలి. అలాగే యాంటీ వైరస్ ఉండటం వల్ల సైబర్ నేరగాళ్లు పంపించే యాప్స్ డౌన్‌లోడ్ కాకుండా సెక్యూరిటీ ఉంటుంది. ఫోన్‌లో యాంటీ వైరస్ తప్పని సరిగా ఉండాలి.పెరుగుతున్న ఆధునికి సాంకేతిక పరిజ్ఞాన్ని సైబర్ నేరగాళ్లు అందిపుచ్చుకొని కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని దిగుమతి చేసుకుంటున్నారు. వారి వద్ద ఉండే స్కానర్‌తో ఇతరుల జేబుల్లో ఉండే పర్సులను స్కానింగ్ చేస్తారు. ఈ స్కానింగ్ ద్వారా పర్సులో ఉండే ఏటీఎం, క్రెడిట్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్‌కాంటాక్ట్‌కు సంబంధించిన వివరాలు, పర్సులో ఏమి ఉన్నా వాటికి సంబంధించిన సమాచారం స్కాన్ అవుతాయి. ఆ వ్యక్తికి సంబంధించి పర్సులో ఉన్న సమాచారం మొత్తం సైబర్ నేరగాళ్ల చేతికి వస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని పర్సునుల వెనుక జేబులో వాడకుండా ఉండాలి. అలాగే మన చుట్టూ ఉన్న వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. వారేం చేస్తున్నారోగమనిస్తూ ఉండాలి.బిజీ లైఫ్‌లో నగదు లావాదేవీలన్నీ ఎక్కువగా ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయి. గూగుల్ పే, పేటీఎం వంటి వాటిలో నగదు బదిలీ వంటివి చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఓపెన్ చేసిన తర్వాత మన పని పూర్తయిన తర్వాత లాగౌట్ చేయాలి. పాస్‌వర్డ్, ఓటిపీ నెంబర్లతో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులు, విద్యార్థులు, ఉద్యోగులు, ఎక్కువగా నగదు లావాదేవీలు నిర్వహించేవారు ఈ జాగ్రత్తలు పాటించాల్సి ఉంది. ఏటీఎం స్వైప్ చేసే సమయంలో పక్కన ఉన్న వారితో జాగ్రత్తగా ఉండాలి. మన వెనుకనే ఉండి, మన పాస్‌వర్డ్‌ను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. వారికి కనపడకుండా పాస్‌వర్డ్‌ను నమోదు చేయాలి.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close