Nationalsocial

బీ టెక్‌ సిలబస్‌లో కీలక మార్పులు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26, (LOCAL NEWS INDIA)
బీ టెక్‌ సిలబస్‌లో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇప్పటికే ఉన్న సబ్జెక్ట్స్‌కు తోడుగా మరో 9 కోర్సులు ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఆర్టిఫిషల్‌ ఇంటలీజెన్స్‌, రోబోటిక్స్‌, బిగ్‌డేటా వంటి సబ్జెక్ట్‌లకు అఖిల భారత విద్యామండలి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఒక్కో సెమిస్టర్‌లో ఒక్కో పేపర్‌గా ప్రవేశపెట్టేలా సిలబస్‌ను తయారుచేస్తున్నారు. కేసీఆర్ ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్‌ ఉన్న కోర్సులను బీ టెక్‌ స్థాయిలో ప్రవేశపెట్టాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి నిర్ణయం తీసుకుంది. పరిశ్రమల అవసరాలకు తగ్గట్లు విద్యార్థులను తయారు చేసేందుకు బీ టెక్‌ స్థాయిలోనే కొత్త కోర్సులతో పాటు డిమాండ్‌ ఉన్న సబ్జెక్ట్‌లపై శిక్షణ ఇవ్వాలని కూడా నిర్ణయించింది. కేటీఆర్‌ సాఫ్ట్‌వేర్‌ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా బీ టెక్‌ కోర్సులు రూపొందించాలంటూ ఏర్పాటైన ఐఐటీ హైదరాబాద్‌ పాలకమండలి ఛైర్మెన్‌ బీవీఆర్‌ మోహన్‌రెడ్డి కమిటీ ఈ సిఫార్సులు చేసింది. దేశవ్యాప్తంగా ఏటా 8 లక్షల మంది బీటెక్‌ విద్యార్థులు బయటకు వస్తున్నా వారిలో ఐటీ ఇండస్ట్రీ కోరుకున్న విధంగా నైపుణ్యాలు ఉండటం లేదని కమిటీ అభిప్రాయపడింది. దీంతో అదే స్థాయిలోనే డిమాండ్‌ ఉన్న కోర్సులు ప్రవేశపెట్టాలని కమిటీ గత డిసెంబరులో సిఫారసు చేసింది. కమిటీ రిపోర్ట్‌ అందిన రెండు నెలల్లోనే ఏఐసీటీఈ మొత్తం 9 సబ్జెక్ట్స్‌ ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుంది. కృత్రిమ మేధ, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింక్స్‌, బ్లాక్‌ చైన్‌, రోబోటిక్స్‌, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌, డేటా సైన్సెస్‌, సైబర్‌ సెక్యూరిటీ, 3 డీ ప్రింటింగ్‌ అండ్‌ డిజైన్‌, వర్చువల్‌ రియాలటీ సబ్జెక్టులకు ఓకే చెప్పింది. దీనికి సంబంధించి మోడల్‌ పాఠ్యప్రణాళిక కూడా విడుదల చేశారు. దీని ప్రకారం ఒక్కో సబ్జెక్టును ఒక సెమిస్టర్‌లో ఒక పేపర్‌గా అందించేలా సిలబస్‌ను రూపొందించారు. వాటిని తప్పనిసరి సబ్జెక్టుగా లేదా ఎలెక్టివ్ సబ్జెక్టుగా తీసుకోవచ్చు. మొత్తం 45 గంటల పాటు థియరీ బోధిస్తారు. వాటితో పాటు ప్రాక్టికల్స్‌ ఏం చేయాలో కూడా సిలబస్‌లో చెప్పుకొచ్చారు. ఏ పుస్తకాలు చదువుకోవచ్చో కూడా సూచించారు. ఈ 9 సబ్జెక్టులకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్‌ ఉందని ఆయా రంగాల్లో మనదేశంలో అవసరమైన నిపుణులు లేరని అందుకే బీ టెక్‌ స్థాయిలో వీటిని అందిస్తున్నట్లు ఏఐసీటీఈ వర్గాలు వెల్లడించాయి

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close