Andhra Pradesh
దుమ్మ రేపుతున్న జగన్ సాంగ్
హైద్రాబాద్, ఫిబ్రవరి 25 (LOCAL NEWS INDIA)
ఏపీలో ఎన్నికల సమరానికి సిద్దమవుతున్నాయి పార్టీలు. నోటిఫికేషన్ కంటే ముందే పార్టీలు ప్రజాక్షేత్రంలోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి. వైసీపీ కొత్త పాటతో ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యింది. రావాలి జగన్.. కావాలి జగన్ అటూ వైసీపీ అధికారంలోకి ఎందుకు రావాలో వివరిస్తూ పాటను రూపొందించింది. ఈ సాంగ్‌ను సోమవారం పార్టీ కార్యాలయంలో వైసీపీ సీనియర్ నేతలు విడుదల చేశారు. ప్రజలకు మరింత చెరువయ్యేలా.. సామాన్య ప్రజలు, రేపటి తరానికి ఈ పాట మరింత ఉత్సాహాన్ని ఇస్తుందన్నారు. గతంలో నిన్ను నమ్మం బాబు అని చంద్రబాబు మోసపూరిత పాలన గురించి ప్రచారం చేశామని.. ఇప్పుడు వైఎస్ జగన్ ఎందుకు అధికారంలోకి రావాలో ఈ పాటలో వివరించామన్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే అమలు చేసే కార్యక్రమాలను పాట ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నామన్నారు.