Andhra Pradesh
టీడీపీకి జనసేన టెన్షన్
కాకినాడ, ఫిబ్రవరి 25, (LOCAL NEWS INDIA)
సార్వత్రిక ఎన్నికలకు మరో రెండు నెలల గడువు కూడా లేదు. రాజకీయ పార్టీలన్నీ ఇప్పటికే వార్ డిక్లెర్ చేసాయి. ఈ తరుణంలో జంప్ జలానీలు పార్టీ అధిష్టానాలకు ముచ్చమటలు పట్టిస్తున్నారు. టీడీపీలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. వాస్తవానికి టీడీపీ, వైసీపీల మధ్య ఇప్పటికే వలసలు పెరిగాయి. వైసీపీలో అధికంగా టీడీపీ నుంచి చేరికలు జరిగాయి. ఇక్కడితో ఆగిపోతుందని అధిష్టానం భావించింది. కాని ఇప్పుడు టీడీపీని జనసేన భయపెడుతుంది. పార్టీలో కీలక నేతలు సీనియర్స్ టీడీపీ ని వీడి జనసేన లోకి వచ్చేలా పవన్ చర్చలు జరుగుతున్నాయని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు వారు పార్టీని విడిచి వెళ్ళే క్రమంలో సీనియర్ ఎన్టీఆర్ ఉన్నప్పుడు పార్టీ వేరు. ఈ పార్టీ వేరు అంటూ ఒక ముద్ర వేసి మరీ బాబు క షాక్ ఇచ్చి జనసేనలోకి జంప్ చేయనున్నారట.. వీరి చేరికల విషయంలో కూడా పవన్ కళ్యాణ్ ఎటువంటి అభ్యంతరం చెప్పలేదని, సీనియర్ నాయకులు పార్టీలో ఉండటం మంచి పరిణామాని పవన్ భావిస్తున్నారట. టీడీపీలో ఉన్నా మాకు ఒరిగింది ఏమిలేదని, అవమానాలు భరించలేక పోతున్నామని, చంద్రబాబు ఒంటెద్దు పోకడలు టీడీపీని పతనం చేస్తున్నాయని వారు ఆరోపిస్తున్నారట. జనసేనలో చేరటానికి మేము సిద్దంగా ఉన్నామని, పార్టీలో పదవులు అవసరం లేదని, తమకు సముచిత స్థానం ఇచ్చి గౌరవించితే చాలని పవన్ తో చర్చలు జరిపారని, అయితే పవన్ కళ్యాణ్ కి వారి చేరికపై మరికొంత క్లారిటీ వచ్చాక ఆహ్వానం పంపుతారని అతవరకూ వేచి ఉండాలని చెప్పినట్టుగా టాక్ విన్పిస్తోంది..ఒక వేళ ఇదే నిజమై చంద్రబాబు ని పార్టీ సీనియర్స్ వీడిపోతే, టీడీపీ కి భారీ నష్టం వాటిల్లడం మాత్రం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. మరి టీడీపీ సీనియర్స్ చేరికలు ఉంటాయా లేదా అనేది భవిష్యత్తులో తేలనుంది అంటున్నారు రాజకీయ పండితులు.