National

చిన్నారిని ముక్కలుముక్కలుగా నరికిన తండ్రి

చెన్నై జనవరి 7 (లోకల్ న్యూస్)
తిరువణ్ణామలై జిల్లా తండారంపట్టులో కుటుంబ కలహాల కారణంగా మూడు నెలల చిన్నారిని ముక్కలుముక్కలుగా నరికిన కసాయి తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు.

కంబంపట్టు గ్రామానికి చెందిన కార్తికేయన్ (30)కి రాజేశ్వరి దంపతులకు మూడు నెలల చిన్నారి వుంది. చిల్లర దుకాణం నడుపుతున్న కార్తికేయన్ ఇంట్లో భార్యాబిడ్డలతో నిద్రకు ఉపక్రమించాడు. అర్ధరాత్రి బిడ్డ కేకలు విన్న తల్లి లేచి చూడగా భర్త బిడ్డను ముక్కలు ముక్కలుగా నరకడం చూసి భయాందోళనకు గురై బిగ్గరగా కేకలు వేసింది. ఆమె కేకలు విన్న చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకోవడం గమనించిన కార్తికేయన్ పరారయ్యేందుకు యత్నించాడు. అయితే స్థానికులు అతడిని పట్టుకుని వానాపురం పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. కుటుంబ కలహాల కారణంగా కార్తికేయన్ కొద్ది రోజులుగా మనస్థాపానికి గురైనట్లు తెలిసింది. పోలీసులు కార్తికేయన్ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close