Andhra Pradesh
ఇది చరిత్రాత్మక ఘట్టం
అమరావతి, జనవరి 7, (లోకల్ న్యూస్)
పోలవరం కాంక్రీట్ పనుల్లో ప్రపంచ రికార్డు సాధించామని సీఎం చంద్రబాబు అన్నారు. సోమవారం నాడు అయన జన్మభూమి-మా ఊరుపై టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
రికార్డు సాధించడం ఒక చరిత్రాత్మక ఘట్టమని అయన అన్నారు. అర్ధరాత్రికే 21వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేసినట్లు తెలిపారు. 24 గంటల్లో 28వేల క్యూ.మీల కాంక్రీట్ పనులు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. కానీ ఇప్పటికే 31వేల క్యూ.మీటర్లకు చేరుకున్నామని వెల్లడించారు. ఉయదం10 గంటలకల్లా 35వేల క్యూ.మీ కాంక్రీట్ వేసే అవకాశం ఉందన్నారు. సంబంధిత అధికారులు, సిబ్బందిని అయన అభినందించారు. వేలాది కార్మికులు, ఇంజినీర్లు, సాంకేతిక సిబ్బంది కష్టానికి ఫలితం దక్కిందని ప్రశంసించారు. ఇదే స్ఫూర్తితో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. శరవేగంగా పనులు పూర్తి చేస్తున్నందుకు సీబీఐపీ అవార్డు సాధించామని స్పష్టంచేశారు. ఆ అవార్డు అందుకున్న 4 రోజులకే మరో రికార్డు సాధించడం అభినందనీయమన్నారు. జన్మభూమి కార్యక్రమంలో ఇప్పటివరకు 1,75,557ఫిర్యాదులు వచ్చాయి. ఫిర్యాదుల పరిష్కారం వేగవంతం చేయాలి. ఈ రోజు గ్రామసభలో విద్యా,వైద్య ప్రగతిపై చర్చించాలని అయన అన్నారు. ఎన్టీఆర్ వైద్యసేవ రూ.5లక్షలకు పెంచాం. 12లక్షల మందికి రూ.5,330కోట్ల వైద్య సేవలు ఇచ్చాం. 7లక్షల మందికి ఎన్టీఆర్ బేబికిట్స్ ఇచ్చాం. అంటువ్యాధుల నివారణకు చేసిన కృషి వివరించాలని అన్నారు. రూ.4,848కోట్లతో పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాం. 33,415అదనపు తరగతి గదులు నిర్మించాం. డిజిటల్,వర్ట్యువల్ క్లాస్ రూములు తెచ్చాం. 35లక్షల మందికి మధ్యాహ్న భోజనం ఇస్తున్నాం. విదేశీ విద్యకు రూ.15లక్షలు సద్వినియోగం చేసుకోవాలి. 4లక్షల మందికి నిరుద్యోగ భృతి ఇస్తున్నాం. నైపుణ్యాభివృద్ధి ద్వారా ఉపాధి కల్పిస్తున్నాం. తాగునీటి కొరత లేకుండా చూడాలి. పశుగ్రాస భద్రత ఇవ్వాలి. ఎక్కడా పశుగ్రాసానికి కొరత ఉండరాదని అన్నారు. ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి. రైతులకు సకాలంలో చెల్లింపులు జరపాలని చంద్రబాబు అన్నారు.