Andhra Pradesh
జనసేన ఒంటరి పోరు-జనసేన అధ్యక్షుడు పవన్
విజయవాడ, డిసెంబర్ 03(లోకల్ న్యూస్)
2019 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ 175 స్థానాల్లో పోటీ చేస్తుందనీ, అధికార ప్రతిపక్ష పార్టీలు చేసే అసత్య ప్రచారాలను నమ్మవద్దని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకి స్పష్టం చేశారు.
వామపక్షాలు మినహ అధికారపక్షంతో గానీ, ప్రతిపక్షం గానీ కలిసే పరిస్థితులు, అవకాశాలు లేవని తేల్చి చెప్పారు. గురువారం ఉదయం జనసేన పార్టీ ఆంద్రప్రదేశ్ రాష్ట్ర కార్యాలయం లో పవన్ కళ్యాణ్ మాట్టాడారు. జనసేన పార్టీ వాళ్లతో కలుస్తుంది, వీళ్లతో కలుస్తుందని ప్రచారం చేస్తున్నారు. ప్రతిపక్షం మాకు అన్ని స్థానాలు ఇచ్చింది. ఇన్ని స్థానాలు ఇచ్చిందనీ రకరకాల ప్రచారాలతో జనసేన శ్రేణుల్ని గందరగోళానికి గురి చేస్తున్నారని అయన అన్నారు. ఇవన్నీ మనల్ని ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలే. అధికారపక్ష నాయకులు సైతం ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం కూడా గందరగోళానికి గురి చేసిందుకే అని అయన అన్నారు. 2014 తెలుగు ప్రజల సుస్థిరత కోసం కొన్ని పార్టీలకి మద్దతు ఇచ్చాం. ఇప్పుడు సమతుల్యత కోసం జనసేన పార్టీ 175 స్థానాల్లో ఒంటరిగా పోటి చేస్తుంది. 25 సంవత్సారాలపాటు యువత భవిష్యత్తుకి అండగా ఉండాలన్న లక్ష్యంతో కొత్త తరం నాయకత్వం వైపు చూస్తున్నాం. అనుభవభవజ్ఞలైన రాజకీయ నాయకులతో పాటు 175 స్థానాల్లో ఎక్కువ శాతం యువతకే అవకాశం ఇవ్వబోతున్నాం. మహిళలు, యువతతో పాటు కొత్తతరం బయటికి రావాలి. చట్టసభల్లో అడుగుపెట్టాలి. ఇందుకు అనుగుణంగా వ్యూహరచన చేస్తున్నాంమని అన్నారు. మనం ఒంటరిగా పోటీ చేస్తున్నాం. భావితరాల భవిష్యత్తుకి కట్టుబడి ఉన్నాం. దయచేసి అధికార, ప్రతిపక్ష నాయకుల మాటలు నమ్మవద్దని పవర్ అన్నారు. ఇలాంటి వార్తల్ని గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో ముక్తకఠంతో ఖండించాలని పార్టీ శ్రేణులకి పిలుపునిచ్చారు. జనసేన పార్టీ స్థాపించింది ఒక ఎన్నికల కోసం కాదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు