Telangana

ఏకగ్రీవమైన పంచాయతీలకు రూ.15లక్షలు-కేటీఆర్

రాజన్న సిరిసిల్ల జనవరి 3 (లోకల్ న్యూస్)
పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవమైన గ్రామ పంచాయతీలకు రూ. 10లక్షలు ప్రభుత్వం ఇస్తుంది. సిరిసిల్ల నియోజకవర్గంలో ఏకగ్రీవమైన గ్రామ పంచాయతీలకు నా ఎమ్మెల్యే నిధుల నుంచి రూ. 15లక్షలు ఇస్తానని కేటీఆర్ ప్రకటించారు.
పంచాయతీ ఎన్నికల్లో పోటీ లేకుండా చూసుకోవాలి. లక్ష్మీపూర్ తండా స్ఫూర్తితో సిరిసిల్ల నియోజకవర్గంలో ఎక్కువ గ్రామాలు ఏకగ్రీవం కావాలన్నారు. సిరిసిల్ల నియోజకవర్గ టీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి కేటీఆర్ హాజరై ప్రసంగించారు. ఇది ఎన్నికల నామ సంవత్సరం.. త్వరలో పంచాయతీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. టీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే ప్రాణవాయువు. సిరిసిల్ల నియోజకవర్గంలో 71 శాతం ఓట్లు టీఆర్ఎస్ కే పడ్డాయి. పంచాయతీ ఎన్నికల్లో అవకాశం రాని వారికి సొసైటీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ప్రాధాన్యం కల్పిస్తాం. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని ప్రజలు అఖండ మెజార్టీతో గెలిపించారు. తెలంగాణ ప్రజలంతా సీఎం కేసీఆర్ వైపే ఉన్నారని అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టమైందన్నారు.ముందస్తు ఎన్నికలకు పోయి గెలిచిన ఘనత సీఎం కేసీఆర్ ది అని తెలిపారు. రాహుల్ గాంధీ, చంద్రబాబు ఎంత దుష్ప్రచారం చేసినా ప్రజలు నమ్మలేదు. ప్రధాని మోదీ, అమిత్ షా, ఐదు రాష్ర్టాల ముఖ్యమంత్రులు, పలువురు కేంద్రమంత్రులు ప్రచారం చేసినా ప్రజలు బీజేపీని తిరస్కరించారు అని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ పరిపాలనా దక్షతను దేశం మొత్తం గుర్తిస్తోందన్నారు. విపక్షాలు ఎన్ని ప్రలోభాలు పెట్టినా ప్రజలు లొంగలేదని పేర్కొన్నారు.  ట్రక్కు గుర్తు వల్ల మనకు ఓట్లు తగ్గిపోయాయి. 4 వేల ఓట్ల తేడాతో 10 సీట్లు కోల్పోయామని తెలిపారు. సంక్షేమ, అభివృద్ధి పథకాలను కొనసాగించాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకాన్ని పలు రాష్ర్టాలు అమలు చేస్తున్నాయి. రైతుల పక్షాన నిలబడకపోతే రాజకీయంగా పుట్టగతులుండవని ప్రధాని మోదీకి అర్థమైంది. రైతుబంధు పథకాన్ని దేశమంతా అమలు చేయాలని ప్రధాని మోదీ ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ కాలంతో పోటీపడుతూ కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేస్తున్నారని కేటీఆర్ తెలిపారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close