National

చంద్రుల పోటా పోటీ ఎత్తులు… హస్తిన కోసం పాట్లు

హైద్రాబాద్, జనవరి 3, (లోకల్ న్యూస్)
ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యర్థులపై మాటలు తూటాలుగా పేల్చడంలో మేటి. తన వాగ్ధాటితో వ్యూహాలతో ప్రధాని పీఠాన్ని అధిరోహించిన కమలదళపతి. సమ్మోహనకర ప్రసంగాలతో ప్రత్యర్థుల ప్రశంసలు సైతం అందుకున్న నేతగా మోడీ నిలుస్తారు.
ఏటికి ఎదురీదే తత్వంతోనే ఎలాంటి నిర్ణయం అయినా ధైర్యంగా తీసుకోవడం ఆయనకే చెల్లింది. అలాంటి మోడీ పై తెలంగాణ ఎన్నికల నాటి నుంచి తెలుగు ముఖ్యమంత్రులు నిప్పులు చెరుగుతూ వస్తున్నారు. వీరిద్దరూ ఒక్కో వ్యూహంతో నిన్న మొన్నటివరకు మోడీ సర్కార్ కి ముందు నుంచి ఒకరు వెనుకనుంచి మరొకరు జై మోడీ అంటూ స్లోగన్ ఇచ్చి తాజాగా వచ్చే ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనాలకోసం యూటర్న్ కొట్టేశారు.పార్లమెంట్ లో చంద్రబాబు అవిశ్వాసం ప్రతిపాదించినపుడు జరిగిన చర్చలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై మోడీ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికి సంచలనమే. తెలంగాణ ముఖ్యమంత్రి సమర్ధవంతంగా తెలివిగా పాలన సాగిస్తున్నారని ప్రశంసించారు మోడీ. చంద్రబాబు ను మాత్రం దారుణంగా తీసిపారేశారు. ఆయన పరిపక్వత లేని రాజకీయాలు సాగిస్తున్నారని పూర్తిగా వైఎస్సాఆర్ పార్టీ పన్నిన వ్యూహంలో పడి ఎన్డీయే నుంచి బయటకు వచ్చారని తాను వైసిపి ప్లాన్ లో చిక్కుకోవద్దని హెచ్చరించినా వినలేదని చురకలు అంటించారు.సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. దాంతో ప్రతి పార్టీ తమ రాజకీయ ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తున్నాయి. కలిసి వున్నవారు కూడా శత్రువులుగా మారిపోతే, శత్రువులు మిత్రులుగా బంధాలు అల్లుకుంటున్నారు. ఈనేపధ్యంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల తరువాత కేంద్రంలో చక్రాలు తిప్పేపనిలో తెలుగు రాష్ట్రాల చంద్రులిద్దరు పోటాపోటీగా ఎత్తులు పైఎత్తులు వేస్తున్నారు. దాంతో దేశవ్యాప్తంగా తెలుగు సీఎంలపై తీవ్రస్థాయిలో ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి.మోడీ కి వ్యతిరేకంగా చంద్రబాబు కాంగ్రెస్ తో దోస్తీ కట్టి ప్రాంతీయ పార్టీలను ఏకం చేసే పనిలో సాగుతున్నారు. కేసీఆర్ మాత్రం కాంగ్రెస్, బిజెపి లేని ఫెడరల్ ఫ్రంట్ ను ఆకాంక్షిస్తూ పర్యటనలు చేస్తున్నారు. అయితే ఈస్థాయిలో ఇద్దరు చంద్రులు ప్రయత్నాలు సాగిస్తుంటే మరోసారి మోడీ వీరిద్దరిని తీసిపారేసేలా తన తాజా ఇంటర్వ్యూలో మాట్లాడటం విశేషం. ఫెడరల్ ఫ్రంట్ అదెక్కడా ?అంటూ కెసిఆర్ ను, ఎపి సీఎంకు తెలంగాణ ప్రజలు షాక్ ఇచ్చారు కదా అంటూ చంద్రబాబు ను తన వ్యాఖ్యలతో ఆటలో అరటిపళ్ళు గా తేల్చారు. మరి ఇద్దరు చంద్రులు మోడీ చేసిన వ్యాఖ్యలకు ఎలా బదులు చెబుతారో చూడాలి.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close