Telangana
సుందిళ్ల బ్యారేజిని పరిశీలించిన సీఎం కేసీఆర్
కరీంనగర్, జనవరి 2, (లోకల్ న్యూస్)
కరీంనగర్ జిల్లాలో సీఎం కేసీఆర్ రెండో రోజు బుధవారం పర్యటించారు.. ప్రాజెక్టుల పరిశీలనలో భాగంగా సీఎం కేసీఆర్ అన్నారం బ్యారేజీ పనులను పరిశీలించారు. .
అన్నారం బ్యారేజీ వద్ద కేసీఆర్ పనులను పరిశీలించారు. అన్నారం బ్యారేజీ వద్ద పనులు 90 శాతం మేర పూర్తికావచ్చాయని అధికారులు సీఎంకు తెలిపారు. అనంతరం అక్కడి నుంచి హెలికాప్టర్లో సుందిళ్ల చేరుకున్నారు. సుందిళ్ల బ్యారేజీ పనులను కేసీఆర్ పరిశీలించారు. సుందిళ్ల బ్యారేజీ పనుల గురించి సీఎం కేసీఆర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనుల పరిశీలనతో పాటు నిర్మాణ పనులు సాగుతున్న తీరు.. ఇంజినీర్లు, అధికారులు ఏం చేస్తున్నారనే దానిపై ముఖ్యమంత్రి ప్రశ్నించారు. గ్రావిటీ, బ్యారేజీ పనుల్లో అక్కడక్కడా నెమ్మదిగా సాగుతున్నాయని.. వాటిని వేగవంతం చేయాలని కేసీఆర్ సూచించారు. ఎట్టిపరిస్థితుల్లో మార్చి చివరినాటికి నిర్మాణ పనులన్నీ పూర్తిచేయాలని అధికారులు, వర్క్ ఏజెన్సీలను సీఎం ఆదేశించారు. యుద్ధప్రాతిపదిక కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేయాలన్నారు. అక్కడక్కడా ఇంజినీర్లు, వర్క్ ఏజెన్సీలకు పలు సూచనలు చేశారు.