social
భారత్‌లో 50కోట్లు దాటిన ఇంటర్నెట్ యూజర్లు
న్యూఢిల్లీ డిసెంబర్ 29 (లోకల్ న్యూస్)
భారత్‌లో ఇంటర్నెట్ వినియోగం రోజురోజుకీ పెరుగుతోంది. ముఖ్యంగా జియో రాకతో డేటా వినియోగం విషయంలో ఇతర టెలికాం సంస్థలు దిగివచ్చిన సంగతి తెలిసిందే. కాగా, 2018లో భారత్‌లో ఇంటర్నెట్ కనెక్షన్లు 65శాతం పెరిగాయని ట్రాయ్ గణాంకాల ద్వారా వెల్లడైంది. అంతేకాదు, ఇంటర్నెట్ వినియోగిస్తున్న వారి సంఖ్య 50కోట్ల మార్కును దాటింది.
సెప్టెంబరు 2018 చివరి నాటికి భారత్‌లో నారో బ్యాండ్, బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లు 56కోట్లకు చేరాయని ట్రాయ్ పేర్కొంది. ఇందులో 54కోట్ల మంది మొబైల్ ద్వారానే ఇంటర్నెట్ వినియోగిస్తున్నారు. మిగిలిన వాళ్లు బ్రాడ్ బ్యాండ్ వాడుతున్నారు.ఇక మొత్తం 56కోట్ల కనెక్షన్లలో 36కోట్ల మంది పట్టణ ప్రాంతాల్లో ఉండగా, 19.4కోట్ల మంది గ్రామీణ ప్రాంతాల వారని ట్రాయ్ వెల్లడించింది. కాగా, ఆగస్టు 31, 2018 నాటికి 445.18మిలియన్ల మంది మొబైల్‌ఫోన్లు, డాంగిల్స్ ద్వారా అంతర్జాల సేవలు పొందుతున్నారు. మొత్తం ఐదు టెలికాం సంస్థలు ప్రధాన వాటాదారులుగా ఉన్నాయి. అత్యధికంగా జియో ఇన్ఫోకామ్(252.25మిలియన్లు), ఉండగా, ఆ తర్వాత భారతీ ఎయిర్‌టెల్(99.29మిలియన్లు), వొడాఫోన్ (51.82మిలియన్లు), ఐడియా సెల్యులార్(47.90మిలియన్లు), బీఎస్‌ఎన్‌ఎల్(20.12మిలియన్లు) ఉన్నాయి.మొత్తం ఇంటర్నెట్ వినియోగదారుల్లో అత్యధికంగా కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, మహారాష్ట్రల్లో 20కోట్లమంది ఉంది ఉన్నారు.