Telangana
జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా కేసీఆర్
న్యూఢిల్లీ, డిసెంబర్ 29, (లోకల్ న్యూస్)
రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జోరు మీదున్న కారు పార్టీ ఇప్పుడు తన దూకుడును మరింత పెంచబోతున్నదా..? అంటే అవుననే అంటున్నాయి టీఆర్‌ఎస్ వర్గాలు. పార్లమెంటు ఎన్నికల తర్వాత ఏకంగా సీఎం పదవిని కూడా కేటీఆర్‌కే అప్పగిస్తారనే వాదనలకు తాజా పరిణామాలు మరింత బలం చేకూర్చేవిగా ఉన్నాయి.
మరోవైపు కార్యనిర్వాహక అధ్యక్షుడి హోదాలో కేటీఆర్.. మొత్తం పార్టీపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం రాష్ట్ర కార్యవర్గం, ప్రధాన కార్యదర్శులతో ప్రత్యే కంగా భేటీలు నిర్వహించిన ఆయన.. గెలుపోటము లపై నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించా లంటూ ఆదేశించారు. ఆ తర్వాత ఆయన అమెరికా కు పయనమయ్యారు. టీఆర్‌ఎస్ గెలుపులో కీలక పాత్ర పోషించిన సూత్రధారులు, పాత్రధారులు, ఇతరత్రా సహాయ, సహకారాలు అందజేసిన ఎన్‌ఆర్‌ఐలతో ఆయన అక్కడ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వారందరికీ కృత జ్ఞతలు తెలిపారు.
ఈనెల 26న హైదరాబాద్‌కు తిరి గొచ్చిన ఆయన మళ్లీ పార్టీ కార్యక్రమాల్లో బిజీ అయి పోయారు. ఈ క్రమంలో మంత్రి పదవులు ఆశిస్తున్న ఎమ్మెల్యేలు గురు, శుక్రవారాల్లో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తమను దృష్టిలో ఉంచుకోవాలంటూ అభ్యర్థించారు.మొన్నటిదాకా కేటీఆర్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు, ఆ తర్వాత శాసన మండలిలోని కాంగ్రెస్ సభ్యులను తమ పార్టీలో విలీనం చేసు కోవటం తదితరాంశాలతో హల్‌చల్ చేసిన పార్టీ అధినేత కేసీఆర్.. ఇప్పుడు ఏకంగా ఢిల్లీ వైపు దృష్టి సారించారు.
దేశ రాజధానిలో పార్టీ కార్యాలయం
ఫెడరల్ ఫ్రంట్ యాత్రలో భాగంగా రాష్ట్రాలన్నీ తిరిగి.. మోడీ వద్దకు చేరుకున్న ఆయన కేంద్ర ప్రభుత్వ సహకారంతో దేశ రాజధానిలో పార్టీ కార్యాలయాన్ని నిర్మించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో సంక్రాం తి తర్వాత శంకుస్థాపన చేయాలని, రెండు, మూడు నెలల్లోనే నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఆయన భావిస్తున్నారు.
కార్యాలయ నిర్మాణానికి అనువైన ప్రభుత్వ స్థలాలను టీఆర్‌ఎస్ ఎంపీలు శుక్రవారం పరిశీలించారు. వారితోపాటు ప్రముఖ వాస్తు నిపుణుడు సుధాకర్ తేజ కూడా పరిశీలించారు. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో పార్లమెంటు ఎన్నికల వరకు ఫెడరల్ ఫ్రంట్ పనులతో బిజీగా గడపనున్న కేసీఆర్.. ఆ తర్వాత పూర్తిగా ఢిల్లీకే పరిమితమవుతారనే వార్తలు వినబడుతున్నాయి.
ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలను తన తనయుడు కేటీఆర్‌కు ఆయన అప్పగించారు.నూతన ఓటర్ల నమోదు, జిల్లాల్లో పార్టీ ఆఫీసుల నిర్మాణంపైన ప్రత్యేకంగా చర్చించారు. ఈ నేపథ్యంలో హైదరా బాద్‌లో కేటీఆర్, హస్తినలో కేసీఆర్ అనే రీతిలో టీఆర్‌ఎస్ వ్యవహారాలు నడుస్తున్నాయి.