social

యాదాద్రిలో ఐదవ రోజు అధ్యయనోత్సవాలు.

Local News  : తెలంగాణ లో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి సన్నిధిలో అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి…ఈనెల పద్దెనిమిదో తేదీన ప్రారంభమైన అధ్యయనోత్సవాలు ఈ నెల ఇరవై మూడో తేదీ వరకు జరగనున్నాయి…

ఆరు రోజుల పాటు ఉదయం సాయంత్రం వివిధ అలంకార సేవలో భక్తులకు దర్శనమిచ్చే నరసింహుడు నేడు ఐదవ రోజు అధ్యయనోత్సవాల్లో భాగంగా వటపత్రశాయి అలంకరణలో బాలాలయంలో సేవపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు….స్వామి వారిని వటపత్రశాయి అలంకారంలో నయన మనోహరంగా వజ్ర వైడూర్యాలతో అలంకార సేవపై చూడముచ్చటగా వివిధ రకాల పుష్పాలతో తీర్చిదిద్దారు ఆలయ అర్చకులు…మేళతాళాలు, మంగళ వాయిద్యాల హోరు నడుమ, వేదపండితుల వేదపారాయణాలు దివ్య ప్రబంధ పారాయణల మధ్య ప్రత్యేక పూజలతో స్వామివారి ఐదవరోజు ఉదయం అధ్యయనోత్సవాలు వైభవోపేతంగా జరిగాయి…అనంతరం వటపత్రశాయి అవతార విశిష్టతను తెలిపారు ఆలయ అర్చకులు…అధ్యయణోత్సవాలు జరిగే ఆరోరోజులు మొక్కు కల్యాణం,శాశ్వత కల్యాణం,సుదర్శన నరసింహ హోమం సేవలు రద్దు చేశారు

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close