Telangana
సిటీలో యదేఛ్చగా డ్రైవింగ్ స్కూల్స్ దందా

మెదక్, డిసెంబర్ 22, (లొకల్ న్యూస్ )
డ్రైవింగ్ స్కూళ్ళు నిలవు దోపిడి చేస్తున్నాయి. ఈ అంశంపై అధికారులు దృష్టి పెట్టక పోవడంతో ఆయా డ్రైవింగ్ స్కూళ్ళ దోపిడికి అడ్డు అదుపు లేకుండా పోయింది. గ్రేటర్ పరిధిలో సుమారు 300 డ్రైవింగ్ స్కూళ్ళు ఉన్నాయి. హైదరాబాద్ రవాణాశాఖ పరిధిలో 150 వరకు ఉండగా, రంగారెడ్డి జిల్లా పరిధిలో మరో 142 స్కూళ్ళు పని చేస్తున్నాయి. ద్విచక్ర వాహనాలతో పాటు జీపు ,కారు ఇతర వాహనాలకు ఈ స్కూళ్ళలో శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు అందచేస్తారు. ఈ ప్రతి నెలో ఒక్కో స్కూల్ నుంచి సుమారు 200 మంది శిక్షణ పొందుతున్నారు.డ్రైవింగ్ శిక్షణతో పాటు లైసెన్స్ కూడా తామే ఇప్పిస్తామని నిర్వాహకులు ముందుగానే వారితో ఒప్పందం చేసుకుంటున్నారు. శిక్షణ పూర్తవ్వగానే తమ పరిధిలోని రవాణాశాఖ కార్యాలయానికి తీసుకు వెళ్ళి లైసెన్స్‌లు ఇప్పస్తున్నారు. పూర్తి స్థాయిలో వాహనాన్ని నడపలేక పోయినా,లైసెన్స్ ఇప్పించడంలో నిర్వాహకులది అందవేసిన చేయి. ప్రతి అభ్యర్థి నుంచి ఆర్టిఏ అధికారులకు కొంత అప్పచెప్పడంతో వారు అనుకున్న పనులున చకాచకా జరిగిపోతున్నాయి. ప్రతి నెలా ఈ విధంగా స్కూళ్ళ నుంచి ఆర్టిఏ అధికారులకు పెద్దమెత్తంలో వస్తున్నట్లు తెలిసింది. కొన్ని డైవింగ్ స్కూళ్ళు మాత్రం నిబంధనల మేరకు పని చేస్తూ మంచి శిక్షణ ఇచ్చి పేరు గడిస్తున్నాయి.వాస్తవానికి డ్రైవింగ్ స్కూల్ నిర్వహించాలనుకునే వారు మెకానికల్ ఇంజనీరింగ్ డిప్లోమో పూర్తి చేసి ఉండాలి. శిక్షణ పోందే వారికి డ్రైవింగ్‌లో మెళుకువలు నేర్పేందుకు శిక్షణ తరగతులు నిర్వహించాలి. వీటి కోసం తప్పని సరిగా క్లాస్ రూం ఏర్పాటు చేసుకోవాలి. డ్రైవింగ్ నేర్చుకునే వాహనానికి డ్యూయల్ క్లచ్, ఎక్స్‌లేటర్, బ్రేక్ తప్పని సరిగా ఉండాలి. నిష్ణాతులైన డ్రైవర్లు శిక్షణ ఇవ్వాలి. అదే విధంగా వాహనా విడిభాగాలు (స్పేర్ పార్ట్)లపై పూర్తి అవగాహన కల్పించాలి. వాహనంపై డ్రైవింగ్ శిక్షణ పోందే అభ్యర్థులకు అవగాహన క్లాసులు నిర్వహించాలి. పూర్తి స్థాయిలో శిక్షణ పోందిన తర్వాత స్కూల్ నుంచి సర్టిఫికెట్ జారీ చేస్తారు. ఆ తరువాతా ఆర్టిఏ కార్యాలయానికి వెళ్ళి డ్రైవింగ్ లైసెన్స్ పొందాల్సి ఉంటుంది. శిక్షణ ఇవ్వడం వరకు స్కూళ్ళ బాధ్యత, డ్రైవింగ్ స్కూళ్ళ నిర్వాహకులు ఆయా వాహనాల శిక్షణ కోసం రెండు నెలల సమయం తీసుకుంటారు. ఇదే సమయంలో అన్ని రకాల శిక్షణ అందిస్తారు.డ్రైవింగ్ స్కూళ్ళు రవాణాశాఖ నిబంధనలు ఏ మాత్రం పాటించడం లేదు. శిక్షణ ఇచ్చే వాహనానికి డ్యూయల్ బ్రేక్,ఎక్స్‌లేటర్ తప్పని సరిగా ఉండాలి కాని ఆ నిబంధన ఎక్కడా పట్టించుకోవడం లేదు. సాధారణ వాహానాలతోనే శిక్షణ ఇస్తున్నారు. వాస్తవానికి డ్రైవింగ్ స్కూళ్ళలో వాహాన విడిభాగాల కోసం ప్రత్యేకంగా ఒక గదిని ఏర్పాటు చేయాలి.అక్కడ వాటి పనితీరుపై క్లాస్‌లు నిర్వహించాలి, కాని ఇటువంటివి ఏమీ అక్కడ కనిపించవు. పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వకుండానే ఆర్టిఏ కార్యాలయాలకు వెళ్ళిడ్రైవింగ్ లైసెన్స్‌లు ఇప్పించి చేతులు దులుపుకుంటున్నారు.దాంతో వారు సరయిన శిక్షణ లేకుండా రోడ్ల మీదకు వాహనాలను తీసుకు వస్తూ తరుచు యాక్స్డెంట్లు చేస్తూ వార ప్రమాదాల బారిన పడటమే కాకుండా ఇతరలను కూడా ప్రమాదాల బారిన పడేస్తున్నారు. అంతే కాకుండా ఒక డ్రైవింగ్ స్కూల్‌కు మాత్రమే అనుమతి పొంది మూడు ,నాల్గు ప్రాంతాల్లో డైవింగ్ స్కూళ్ళను నడుపుతున్నారు. ఈ విధంగా అనుమతులు లేకుండా ఉన్న స్కూళ్ళు 200కు పైగా నే ఉన్నట్లు సమాచారం. డ్రైవింగ్ స్కూళ్ళ నిర్వాహకులు కొన్ని ప్రాంతాల్లో రూ. 8 వేల నుంచి 12 వేలర వరకు వసూలు చేస్తుండగా బంజారాహిల్స్,జూబ్లీహిల్స్ తదితర సంపన్నులు ఉండే ప్రాంతాల్లో రూ.15 నుంచి 20 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఫీజులపై నియంత్రణ లేక పోవడంతో వారు ఇష్టం వచ్చిన విధంగా ఫీజులు వసూలు చేస్తూ నిలవుదోపిడికి పాల్పడుతున్నారు.