Religious
చింతమడకలో ఓటేసిన కేసీఆర్
లోకల్ న్యూస్ సిద్దిపేట:ఈసారి ఎన్నికల్లో ఓటింగ్ శాతం బాగా పెరిగే అవకాశం కనిపిస్తున్నదని తెరాస అధినేత, అపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. శుక్రవారం నాడు చింతమడకలో ఓటు వేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. పెద్ద ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ముందుకు రావడం శుభపరిణామమన్నారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించబోయేది టీఆర్ఎస్సేనని అన్నారు. వృద్ధులు కూడా ఓటు వేసేందుకు ఆస్తకి కనబరుస్తున్నారు…అంతా సానుకూలంగా ఓటింగ్ జరుగుతోందని అయన అన్నారు. భారీ మెజారిటీతో తాము గెలవబోతున్నామని, ఈ విషయం సాయంత్రానికి ఎగ్జిట్ పోల్స్ రూపంలో వెల్లడవుతుందని తెలిపారు. తాను కేవలం ఓటు వేసేందుకు మాత్రమే వచ్చానని, గ్రామస్థులను కలవలేదని అయన అన్నారు.