
Kalinga Times ,New Delhi : దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష జరిగిందని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ లోక్ సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై స్పందించిన ఆయన మాట్లాడుతూ విద్యా, ఉద్యోగాల్లో ఎలాంటి ప్రోత్సహం ఇచ్చే పథకాలు లేవన్నారు. దక్షిణాది రాష్ట్రాలు రూపాయి పన్ను చెల్లిస్తే తిరిగి కేవలం 65 పైసలు మాత్రమే కేంద్రం ఇస్తోందన్నారు. దక్షిణాది రాష్ట్రాలపై ఉత్తర భారత నాయకుల వివక్ష స్పష్టంగా అర్ధం అవుతోందన్నారు.తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతున్నా వ్యక్తిగత కేసులకు భయపడి సీఎం కేసీఆర్ మాట్లాడడంలేదని, పార్లమెంట్‌లో టీఆర్ఎస్ ఎంపీలు నోరు మెదపడం లేదని విమర్శించారు.