Telangana
కేసీఆర్ కు బుధ్ది చెప్పాలి
హైదరాబాద్,లోకల్ న్యూస్ :ఎల్బీ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటి చేస్తున్న దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కి ఎం ఆర్ పీ యస్ జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ మద్దతు ప్రకటించారు. బుధవారం అయన ఎన్బీ నగర్ లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ వ్యాప్తంగా మా శ్రేణులు కూటమిలో భాగస్వామ్యం అయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కు సోనియా గాంధీ తీసుకున్న నిర్ణయం ఒక చరిత్ర, అమరులైన విద్యార్థి, ఉద్యమ కారుల బలిదానాలు చూసి పార్టీ కి నష్టం అని తెలిసి కూడా రాష్ట్రం ఏర్పాటు చేశారని అయన అన్నారు. అందుకే తెలంగాణ ప్రజలు సోనియా గాంధీకి కృతజ్ఞత ఓటు వేయాలని కోరారు. దళిత ముఖ్యమంత్రి అని మోసం చేసిన కేసీఆర్ కు బుద్ధి చెప్పాలని, దళితులకు మూడు ఎకరాలు అని చెప్పి మరోసారి మోసం. ముస్లిం రిజర్వేషన్లు, గిరిజన రిజర్వేషన్లు, బీసీ రిజర్వేషన్లు అని మభ్యపెడుతు వాటిని నీరుగార్చి కేసీఆర్ ప్రజలను అవమానించారని అయన ఆరోపించారు. దళితులను ఒక్కలనే కాదు అన్ని వర్గాల పేదలకు కేసీఆర్ అన్యాయం చేసారని అన్నారు. ఒక్క ఆయన కుటుంబ సభ్యుల ఆస్తులు ఎందుకు పెరుగుతున్నయో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. కేసీఆర్ ఓటమి కొంగర కలన్ లొనే ఖాయం మైంది. పెక్రటెరియట్ ను వదిలి ఫామ్ హౌస్ పాలన చేసిన కేసీఆర్ అని అయన విమర్శిపంచారు. సొంత సెక్రటేరియట్ లేని చంద్రబాబు తాత్కాలిక సెక్రటేరియట్ వెళ్తుండు నువ్వు అవసరం లేకున్నా ప్రగతి భవన్ నిర్మించుకున్నావని అన్నారు. పేదలకు డబుల్ రూమ్ ఇళ్లు ఎందుకు నిర్మించలేదో చెప్పాలని అన్నారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం నిర్మాణం అన్న కేసీఆర్ కనీసం అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో కూడా పూలమాలలు వేయలేదు. కోదండరాం ను, రేవంత్ రెడ్డిని, హరగోపాల్ సార్ ను నిర్దాక్షిణ్యంగా నిర్బంధం చేసారని అన్నారు. తెలంగాణ లో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కూటమి కి ఓటు వేయాలని అయన కోరారు.