Telangana
తెరాసను నామరూపాలు లేకుండా చేయాలి
సత్తుపల్లి,లోకల్ న్యూస్ :జర్నలిస్ట్ లకు 5 లక్షల రూపాయల తో డబుల్ బెడ్రూం కట్టించి బాధ్యత మహాకూటమి తీసుకొంటుందని బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. సత్తుపల్లి ని జిల్లా కేంద్రం ఏర్పాటు చేయడం మహాకూటమి బాధ్యత అని అయన అన్నారు. బుధవారం నాడు అయన ఖమ్మం జిల్లా సత్తుపల్లి మహాకూటమి బహిరంగ సభకు హజరయి ప్రసంగించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో టిడిపి పార్టీ నుండి గెలిచి వేరే పార్టీలోకి వలస పోయారని ఒకే ఒక్కడు సండ్ర వెంకట వీరయ్య మాత్రం ఎటువంటి ప్రలోబానికి లొంగకుండా నిరుపేదల ఆత్మ గౌరవాన్ని ,సత్తుపల్లి ప్రతిష్ట ను హైదరాబాద్ నడి బొడ్డుపై నిలిపానని అన్నారు.అందుకే సండ్ర అంటే నాకు ఇష్టం అని సభలో ఆయన తెలిపారు.కేసీఆర్ నన్ను ఎందుకు తిడుతున్నారో నాకు అర్ధం కావడం లేదని మీకైనా అర్ధం అవుతోందా తమ్ముళ్లు అని అడిగారు. తెలంగాణా ను కాపాడుటకోసం టిఆర్ఎస్ ను నామరూపాలు లేకుండా చేయాలని కోరారు.అన్ని అవకాశాలు ఉన్న సత్తుపల్లి ని జిల్లా కేంద్రం ఎందుకు చేయలేదని అన్నారు.మహాకూటమి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం మని తరువాత సత్తుపల్లి ని అన్ని రకాలుగా అభివృద్ధి ని మహాకూటమి తీసుకుంటుందని అన్నారు. నాలుగున్నర యేండ్లుగా ఈ ప్రభుత్వం సామాజిక న్యాయం దెబ్బతీసిందని,నిరుపేదలకు ఇంధరమ్మ ఇండ్లుకు బిల్లు ఇవ్వలేదని అన్నారు.మహాకూటమి అధికారంలోకి వస్తే వారి స్వంత స్థలంలో 5 లక్షలతో ఇల్లు కట్టిస్తామని, డ్వాక్రా మహిళలు 10 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం ఒకోక్కరికి వారి ఖాతాలో 10 వేల జమచేస్తామని,ఉచితంగా బి పి యల్ కుటుంబాలకు సంవత్సరం నకు గ్యాస్ సిలిండర్ 6ఇస్తామని, సన్నబియ్యం 7 కిలోలు,నిరుపేదలకు 200 యూనిట్లు కరంట్ బిల్లు కట్టకుండా అమలు చేయడం జరుగుతుంది అన్నారు.తెలంగాణ ను కాపాడడం కోసం కాంగ్రెసు పార్టీ,టీడీపి తెలంగాణ జన సమితి, సీపీఐ పార్టీలు కలవడం జరిగిందని ప్రతి ఒక్కరు సైకిల్ గుర్తు పై ఓటు వేసి సండ్ర కు అఖండ విజయం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి, మాజీమంత్రి సంభాని చంద్రశేఖర్,ఏపీ శాసన సభ్యులు నల్లగట్ల స్వామిదాసు,మహాకూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.